← Back to news

సచివాలయ ఉద్యోగులకు Good News!

By Mahesh· 1h ago· AP
సచివాలయ ఉద్యోగులకు Good News!

AP: విజయవాడలో సచివాలయ ఉద్యోగుల 11 గంటల <a href="https://www.theclearcutnews.com/n/nmPdXuA">ధర్నా ముగిసింది.</a> ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు అప్‌గ్రేడ్ చేయనుంది. నాలుగు కేటగిరీల ఉద్యోగులకు ప్రమోషన్లకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ప్రమోషన్లు, వాటితో ఖాళీ అయ్యే పోస్టుల్లో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు. దీంతో రెండు కేటగిరీల్లో 1,630 మందికి ప్రమోషన్ ఛాన్స్‌లు దక్కనున్నాయి.

More in AP

30న విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్
AP· 1h ago

30న విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్

AP: మాజీ MP విజయసాయి రెడ్డి <a href="https://x.com/VSReddy_MP/status/2104181451017314389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104181451017314389%7Ctwgr%5E124069a54fcc6e322130986b2b15649af866299e%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fandhra-pradesh%2Fvisakhapatnam%2Fvijayasai-reddy-visakhapatnam-press-meet-september-30-vk-1561950.html">'X'లో రాష్ట్ర రాజకీయాలపై</a> హాట్ కామెంట్స్ చేశారు. రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు విశాఖలోని దస్పల్లా హోటల్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, తెరవెనుక పొలిటికల్ అలయెన్స్‌లు, గిరిజనులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న మత మార్పిడులపై మాట్లాడతానన్నారు.