← Back to news

అమెరికాలో డూమ్స్‌డే రాబోతోందా?

By Krishna· 9 Sept 2026
అమెరికాలో డూమ్స్‌డే రాబోతోందా?

అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందనే ప్రచారం జరుగుతోంది. 2026 ఆగస్టు 19న అమెరికా జాతీయ అప్పు 40 ట్రిలియన్ డాలర్లు దాటింది. “ఈ సంఖ్యలో మ్యాజిక్ ఏమీ లేదు. మనం గ్రోత్‌తో దాన్ని అధిగమించవచ్చు” అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఎకానమీ కుప్పకూలాలంటే 5 పరిస్థితులు ముందుగా జరగాలని నిపుణులు చెబుతున్నారు. రుణం పెరగడం మాత్రమే కాదు.. వడ్డీ భారం పెరగడం, విదేశీ నమ్మకం తగ్గడం, డాలర్ పతనం, జీరో గ్రోత్ వంటి అంశాలున్నాయి. వీటిలో 2 ఈ వారం జరిగాయి. మిగతావి కూడా జరిగితే.. ఆర్థిక వ్యవస్థ పతనమైనట్లే.!

More in International