← Back to news

బెళగావిలో 15 వేల ఓటర్ల పేర్లు తొలగించే కుట్ర: రాహుల్ గాంధీ

By Vishi· 1h ago· X

దేశమంతా ఓటు దొంగతనంపై ఆగ్రహంతో ఉన్నా, BJP-EC ఇంకా అదే పనులు చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలోని బెళగావిలో ఒకేసారి సుమారు 15 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించే కుట్ర జరుగుతోందని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 22, 23, 24వ తేదీల్లో ఫారం-7 అప్లికేషన్స్ వెల్లువగా వచ్చి, అనేకమంది పేర్లు లిస్టు నుంచి తొలగిపోయాయని తెలిపారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్లే లక్ష్యంగా బీజేపీ ఈ పని చేసిందని ఆరోపించారు.

More in Current Affairs