దుర్గామాత ముందు వేడుకోలు... NHM సమ్మె 8వ రోజు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 8వ రోజు కొనసాగింది. కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉద్యోగులు దుర్గామాతను దర్శించుకుని, తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ గౌస్ పాషా, కోశాధికారి ప్రవీణ్, డాక్టర్ మహతి, తదితరులు పాల్గొన్నారు.


