← Back to news

పట్టపగలే చోరీ.. ₹1.10 లక్షలు అపహరణ

By KUCHIPUDI BUJJIBABU· 50m ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో పట్టపగలే చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు, బీరువాను ధ్వంసం చేసి ₹1.10 లక్షల నగదు అపహరించారు. కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన పద్మ తిరిగి వచ్చేసరికి చోరీ గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. పట్టపగలే చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in Local