← Back to news

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి: వల్లభనేని

By KUCHIPUDI BUJJIBABU· 50m ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

స్థానిక సంస్థల ఎన్నికల్లో దుగ్గిరాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో సుమారు ₹1,600 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.

More in Local