← Back to news

ఘనంగా ధమ్మచక్ర వేడుకలు

By Pinjari Shiva Kumar· 55m ago· Vempet, Metpalli, Jagitial
ఘనంగా ధమ్మచక్ర వేడుకలు

మెట్‌పల్లి పట్టణంలోని చవిడి వద్ద అశోక విజయదశమి, ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ గౌరవ సభ్యుడు నల్ల పురుషోత్తం పంచశీల జెండాను ఆవిష్కరించారు. కళింగ యుద్ధం తర్వాత క్రూరత్వాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించిన సామ్రాట్ అశోకుడు శాంతి, ధర్మ మార్గాల్లో పాలన సాగించిన చారిత్రక రోజే ఈ దినోత్సవమని వక్తలు పేర్కొన్నారు. అశోకుడి బాటలోనే నడిచి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లక్షలాది మంది అనుయాయులతో కలిసి నాగ్‌పూర్‌లో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారని చెప్పారు.

More in Local