చెస్ అకాడమీకి ప్రభుత్వ సహకారం.. హంపి విజ్ఞప్తి!

గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ను ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి కలిశారు. శుక్రవారం తండ్రి అశోక్తో కలిసి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. చెస్ ఒలింపియాడ్–2026లో మహిళల విభాగంలో భారత జట్టు, వ్యక్తిగత విభాగంలో హంపి కాంస్య పతకాలు సాధించారు. ఈ విజయాలపై లోకేష్ హంపిని అభినందించారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


