అర్హులైన దివ్యాంగులకు వాహనాలు అందజేత
విజయనగరం జిల్లా రాజాంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని MLA కోండ్రు మురళీమోహన్ తెలిపారు. రాజాం TDP కార్యాలయం వద్ద మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి చెందిన ఆరుగురు అర్హులైన దివ్యాంగులకు రెట్రోఫిట్ మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


