← Back to news

ఫైర్ ఇంజిన్‌తో ఇంటిని కడిగించుకున్న BJP ఎమ్మెల్యే

By Vishi· 2h ago

గుజరాత్‌ రాష్ట్రం దాహోద్ జిల్లా దేవ్‌గఢ్ బారియా నియోజకవర్గ BJP ఎమ్మెల్యే బాచూభాయ్ ఖబాద్ తన ఇంటిని ఫైర్ ఇంజిన్‌తో కడిగించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మున్సిపాలిటీకి చెందిన ఫైర్ వాహనం 25 కిలోమీటర్లు వెళ్లి, ఇంటి బయటి గోడలపై నీరు చిలకరించింది. ఏదో అత్యవసరం అనుకుని ఫైరింజన్ పంపామని, ఆ తర్వాత ఇంటి గోడలు కడగమని చెప్పారని అధికారులు వివరించారు. అధికారులు ఎమ్మెల్యే నుంచి ₹2,700 వసూలు చేశారు.

More in Viral