ప్రేమంటే ఇది.. చివరిసారి అతని కోసం వచ్చిన ఏనుగు
చిన్నప్పటి నుంచి బిడ్డలా పెంచిన మహౌత్ చనిపోవడంతో ఓ ఏనుగు ఎమోషనల్ అయింది. మహౌత్ ఇంటికి వచ్చిన ఏనుగు తొండం పైకెత్తి చివరి వీడ్కోలు పలికింది. 70 సెకన్ల వీడియోలో దాని బాధ స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషులు, ఏనుగుల మధ్య బాండ్ ఎంత బలంగా ఉంటుందో ఈ ఘటన చూపించింది.