అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం

TG: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శాసనూలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ షాహిదాబేగం BLOగా విధులు నిర్వహిస్తున్నారు. 'SIR', ఆన్‌లైన్ అప్డెట్స్, ఫారాల పరిశీలన, ఇంటింటి సర్వేలు, డేటా నమోదు వంటి పనులు వెంటనే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి పెట్టారు. దీంతో పెబ్బేరులోని ఆమె ఇంట్లో పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు, గుడ్లు, తదితర వాటి వివరాలు యాప్‌లో సమాచారం నమోదు చేయడంతోపాటు ఎన్నికల విధులు నిర్వహించడం కష్టంగా మారిందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



