← Back to news

సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు

By డీకే· 19 Jun 2026· The https://www.hmtvlive.com/telugu-news/tirupati/secretariat-employee-vijaya-ramaiah-arrested-under-pocso-act-157946Clearcut News
సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్ సచివాలయ ఉద్యోగి విజయరామయ్య తోటి మహిళా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె కుమార్తెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. విజయరామయ్యకు స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ పరిచయంతో ఆమె కుమార్తె అయిన 9వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూమ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపిస్తూ బాలికను బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.