విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

TG: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని, ఆయనను కేంద్ర క్యాబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని CM రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ నుంచే ‘సడక్ సే సంసాద్’ వరకు పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలపై పోలీసుల దాడిని ఖండించారు. ఈ పోరాటం కాంగ్రెస్, BJP మధ్య కాదని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు.



