గుడిలో పెళ్లి.. OYOలో హత్య?

TG: అమీర్‌పేటలోని Gokul Pride OYOలో 34 ఏళ్ల శిరీష అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమెకు 38 ఏళ్ల శ్రీనివాస్‌తో ప్రేమ పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 24న ఇద్దరూ OYO రూంలో దిగగా.. నెక్స్ట్ డే శ్రీనివాస్ వెళ్లిపోయాడు. గదిలో శిరీష మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్టెన్ రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.

