వీల్‌చైర్‌లో MLA ఇంటికి..!

TG: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తల్లికి గవర్నమెంట్ హాస్పిటల్‌లో టైముకి ట్రీట్‌మెంట్ అందలేదని ఆరోపిస్తూ, కొడుకు ఆమెను వీల్‌చైర్‌లోనే MLA ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి తీసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. పులిమడుగుకి చెందిన 55 ఏళ్ల భూక్యా బుజ్జి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొడుకు రాజ్‌కుమార్ ఆమెను మంగళవారం రాత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సిబ్బంది చికిత్స చెయ్యకుండా, తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. చివరకు హాస్పిటల్ RMO శ్రీధర్.. MLA ఇంటికి వచ్చి.. బాధితులను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.

