← Back to news

జపాన్‌లో ఇంత ప్రశాంతత ఎలా?

By Anusha· 54m ago· Instagram
జపాన్‌లో ఇంత ప్రశాంతత ఎలా?

జపాన్‌లో రోజువారీ జీవితంలో పాటించే కొన్ని సోషల్ అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రజారవాణాలో కామ్‌గా ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా బిహేవ్ చేయడం, పబ్లిక్ ప్లేసెస్ శుభ్రంగా ఉంచడం, స్థానిక సంప్రదాయాలను గౌరవించడం అక్కడ సాధారణం. వీటిని రూల్స్‌లాగా కాకుండా ఇతరుల పట్ల గౌరవం, సామాజిక బాధ్యతగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం వల్ల షేర్డ్ స్పేస్‌లలో క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. చిన్న అలవాట్లే సమాజంలో సానుకూల వాతావరణానికి దోహదం చేస్తాయి.

More in International