మక్కాకు దాడి ముప్పు..సౌదీలో అలర్ట్

సౌదీ అరేబియాలోని మక్కా నగరం సమీపంలో వైమానిక దాడి ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. మక్కాతోపాటు జెడ్డా, తాయిఫ్ ప్రాంతాల్లోనూ అలర్ట్ ప్రకటించారు. హూతీల నుంచి డ్రోన్ లేదా క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో ఈ హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మక్కాకు దక్షిణంగా ఓ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. అయితే ఆ డ్రోన్ మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు హూతీలు ప్రకటించలేదు.



