ఏకరూప దుస్తుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం

TG: విద్యార్థినుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో పాటు సేవాభావాన్ని పెంపొందించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఓ చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ చంద్రకళ మాట్లాడుతూ.. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థినుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.



