← Back to news

చిన్నహ్యాట కొండల్లో యథేచ్ఛగా తవ్వకాలు

By G Srinuvasulu· 1h ago

AP: కర్నూలు జిల్లా హొలగుంద మండలం చిన్నహ్యాట గ్రామ కొండల నుంచి ఎర్రమట్టిని పెద్ద ఎత్తున తరలిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విండ్ పవర్, రోడ్డు పనుల పేరుతో నెలలుగా భారీ వాహనాలతో ఎర్రమట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్వే నంబర్ 194 పరిసర కొండల్లో తవ్వకాలు జరుగుతున్నా అనుమతులు ఉన్నాయో లేదో అధికారులు స్పష్టం చేయడం లేదని తెలిపారు. పచ్చని కొండలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

More in Local