← Back to news

దుర్గామాత రూపంలో వినూత్న బతుకమ్మ

By A VIJAY KUMAR· 20h ago· Warangal

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ ఉద్యోగి విజేందర్ వినూత్నంగా బతుకమ్మను అలంకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. దుర్గామాతకు చీర కట్టినట్లుగా రూపకల్పన చేసి, చుట్టూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. అమ్మవారి రూపం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయానికి సృజనాత్మకతను జోడించిన విజేందర్‌ను పట్టణవాసులు అభినందించారు. ఈ వినూత్న బతుకమ్మను చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు.

More in Local