ప్రభుత్వ బడులకు దిక్కేది?: ఆకునూరి మురళి

TG: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ఐసీయూలో ఉందని, తక్షణమే బలోపేతం చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగే 12 రోజుల ‘విద్యా బస్సు యాత్ర’ను ప్రారంభించారు. ప్రభుత్వ విద్యను కాపాడటంతోపాటు స్టూడెంట్స్, టీచర్స్ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యమన్నారు. 80–85 శాతం మంద పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.



