← Back to news

KCR ఫాంహౌస్ కేసులో ట్విస్ట్.. అరెస్టులకు హైకోర్టు బ్రేక్!

By Mahesh· 39m ago· TG
KCR ఫాంహౌస్ కేసులో ట్విస్ట్.. అరెస్టులకు హైకోర్టు బ్రేక్!

TG: KCR ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసులో అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఈ ఘటనపై కాంగ్రెస్, BRS మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు.

More in TG