← Back to news

ప్రభుత్వ విద్య కోసం టీపీఎఫ్ బస్ యాత్ర

By Nani eluri· 1h ago
ప్రభుత్వ విద్య కోసం టీపీఎఫ్ బస్ యాత్ర

TG: ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ బస్ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యాకమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన యాత్ర మొదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో డొనేషన్, అధిక ఫీజులను ఆపాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో 52 రకాల సౌకర్యాలు కల్పించాలని, విద్యకు బడ్జెట్‌లో 18 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 జిల్లాల్లో 12 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ముందు ఖమ్మం బడులను పరిశీలించనున్నారు.

ప్రభుత్వ విద్య కోసం టీపీఎఫ్ బస్ యాత్ర
ప్రభుత్వ విద్య కోసం టీపీఎఫ్ బస్ యాత్ర

More in TG