ఏపీ, తెలంగాణకు 5 లక్షల ఇళ్లు.. కేంద్రం బిగ్ అలర్ట్!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు అలాట్ చేసినట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1.20 లక్షల సాయం ఇవ్వగా.. ఎక్స్‌ట్రా 1.80 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ వస్తుందన్నారు. టాయిలెట్‌కు 12 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అర్హుల ఎంపిక ఆవాస్ ప్లస్ యాప్, జియో ట్యాగింగ్‌తో జరుగుతుందని చెప్పారు. ఇన్‌కమ్ లిమిట్‌ను 10 వేల - 15 వేల రూపాయలకు పెంచామని, బైక్ లేదా ఫ్రిజ్ ఉన్నా అర్హత కోల్పోరని క్లారిటీ ఇచ్చారు.



