'Nepo Kid' విమర్శలపై కేటీఆర్ రియాక్షన్

తనను 'Nepo Kid'(వారసత్వ రాజకీయ నాయకుడు) అని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ‘ఎక్స్’ అకౌంట్‌లో రియాక్ట్ అయ్యారు. ‘కాంగ్రెస్ జోకర్లు నన్ను 'నెపో కిడ్' అని ట్రోల్ చేస్తున్నారు. నెహ్రూ కుమార్తె(ఇందిరా గాంధీ) కొడుకు(రాజీవ్ గాంధీ) కొడుకైన (రాహుల్ గాంధీ) నాయకుడిగా ఉన్న పార్టీ నుంచి ఇలాంటి మాటలు రావడం హాస్యాస్పదం" అంటూ పోస్ట్ రాశారు.


