ఎమ్మెల్యే సార్.. ఇదేం బిహేవియర్?
TG: మహిళలకు ఫ్రీ బస్సు పథకం తీరు పరిశీలించేందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే ఆయన తీరు పట్ల ప్రజలు మండిపడుతున్నారు. బాలికలతో మాట్లాడి, వారి వివరాలు తెలుసుకున్న ఆయన ఆ బాలికను తాకడం, తను ఇబ్బంది పడుతున్నా వదలకుండా చేయి పట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. బాలికలతో ఇలాగేనా ప్రవర్తించడం అని జనం మండిపడుతున్నారు.



