INDI కూటమి పోరాటం కుటుంబాల కోసమే: రామచందర్ రావు

TG: SIRను వ్యతిరేకిస్తున్న INDI కూటమి నేతలపై BJP రాష్ట్ర ప్రెసిడెంట్ N. రామచందర్ రావు విమర్శలు చేశారు. INDI కూటమి పేరుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాకుండా తమ కుటుంబాలు, రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకే పోరాడుతున్నారని ఆరోపించారు. కూటమిలోని చాలామంది బెయిల్‌పై బయట ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారున్నారని అన్నారు. వారి ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్ కోసమే పోరాటం చేస్తున్నారని విమర్శించారు. దేశానికి మంచి పాలన కోసం వారు పోరాడటం లేదన్నారు.

