← Back to news

అపార్ట్‌మెంట్ గోడలో కోట్ల క్యాష్.. రోలెక్స్ వాచీలు!

By Mahesh· 1h ago· CNN· Italy

ఇటలీలోని నేపుల్స్‌లో పోలీసుల రైడ్‌లో భారీగా దాచిన క్యాష్ బయటపడింది. కైవానోలోని ఓ అపార్ట్‌మెంట్ గోడలు, ఫ్లోర్ టైల్స్, ఫర్నిచర్‌లో దాదాపు 35 కోట్ల రూపాయలు దాచినట్లు అధికారులు గుర్తించారు. 50 యూరో నోట్లను సెల్లోఫేన్‌లో చుట్టి రహస్యంగా ఉంచారు. 11 రోలెక్స్ వాచీలు, వెపన్స్, డ్రగ్స్‌కు సంబంధించిన మెటీరియల్‌ను కూడా సీజ్ చేశారు. మాఫియా తరహా నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్‌టార్షన్ ఆరోపణలపై 34 మందిని అరెస్ట్ చేశారు.

More in International