UNలో నెతన్యాహు స్పీచ్.. ప్రతినిధుల వాకౌట్
ఐక్యరాజ్యసమితి(UN) జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పీచ్ ఇస్తుండగా భారీ వాకౌట్ జరిగింది. ఆయన మాట్లాడుతుండగానే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాల్ నుంచి బయటకు వెళ్లారు. సౌదీ అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, అల్జీరియా సహా కొన్ని దేశాల ప్రతినిధులు బయటకు వెళ్లినట్లు వీడియోల్లో కనిపించింది. నెతన్యాహు మాత్రం బయటకు వెళ్లిన వారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.



