← Back to news

శ్రీశైలంలో విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

By Mahesh· 25 Aug 2026· శ్రీశైలం
శ్రీశైలంలో విషాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

AP: శ్రీశైలం ఆలయ దగ్గరలోని సత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌, ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 20న ఆటోలో వచ్చిన ఫామిలీ వడ్డెర సత్రంలో రూమ్‌ను బుక్‌ చేసుకున్నారు. దర్శనం తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు బాత్రూమ్‌లో, మరో ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మూఢనమ్మకాలా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 4h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.