దేశాన్ని హైజాక్ చేస్తున్నారు: రాహుల్ ఫైర్
ECI ఆఫీసుకి వెళ్తామంటే వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ. ఇవాళ ఉదయం పార్లమెంట్ నుంచి ECI ఆఫీసుకి మార్చ్ నిర్వహించారు ఇండియా బ్లాక్ పార్టీల MPలు. ఐతే.. ECI ఆఫీసుకి 300 మీటర్ల దగ్గర్లో రోడ్లను బ్లాక్ చేశారు పోలీసులు. దాంతో విపక్ష MPలు, అక్కడే ధర్నా చేస్తున్నారు. ఆకాశవాణి భవనం గేటును తెరిస్తే, అటు నుంచి వెళ్లాలని చూస్తున్నారు. ఆ గేటును పోలీసులు తెరవట్లేదు. పోలీసులు, కేంద్రం తీరుపై మండిపడ్డారు రాహుల్.



