చైన్ స్నాచింగ్‌లపై అవగాహన

AP: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎమ్మెస్ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌కు చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలపై పోలీసులు అవగాహన కల్పించారు. గుత్తి సీఐ రామారావు ఆదేశాల మేరకు ఎస్సైలు సురేష్, అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ హనుమంతప్ప ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, ఒంటరిగా ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ఖరీదైన బంగారు ఆభరణాలను బహిరంగంగా ధరించవద్దని, ద్విచక్ర వాహనాలపై వెనుక నుంచి వచ్చే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.



