విద్యార్థినుల ఆరోగ్యంపై హెచ్‌ఎం ప్రత్యేక శ్రద్ధ
TG: విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ రామకృష్ణ సొంతఖర్చుతో సానిటరీ ఇన్సినరేటర్ ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వినియోగించిన సానిటరీ ప్యాడ్లను పారవేయడంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ సదుపాయం కల్పించారు. సాధారణ ఎలక్ట్రికల్ ఇన్సినరేటర్‌కు సుమారు రూ.18 వేలు ఖర్చవుతుండగా, విద్యార్థినుల అవసరాలకు అనుగుణంగా కేవలం రూ.3 వేలతో స్వయంగా రూపొందించారు.



