← Back to news

తాత మధును బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ ధర్నా

By Sunke Vinith· 56m ago
తాత మధును బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్ ధర్నా

TG: BRS ఎమ్మెల్సీ తాత మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లి గురించి తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాయకులు ఆరోపించారు. తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Local