బీర్పూర్ కిడ్నాప్ కేసు ఛేదన.. సిబ్బందికి ప్రశంసలు

TG: కిడ్నాప్ కేసును కొన్ని గంటల్లోనే ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బంది, గ్రామస్తులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి బహుమతులు అందజేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు ఛేదనలో కానిస్టేబుల్ మల్లేష్‌తో పాటు రాజారాంపల్లి గ్రామస్తులు సతీష్, ఏడుకొండలు సహకరించారు. పోలీసులకు ప్రజల సహకారం ఎంతో కీలకమని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన జగిత్యాల రూరల్ CI సుధాకర్, SI రాజు, సిబ్బందిని కూడా అభినందించారు. కార్యక్రమంలో DSP పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.



