← Back to news

సిద్ధిపేటలో ఘర్షణ

By Krishna· 1h ago
సిద్ధిపేటలో ఘర్షణ

TG: సిద్ధిపేట.. దామరకుంట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. KCR ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లికి బయలుదేరగా.. వారి కాన్వాయ్‌ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. రాళ్ల దాడి చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి, తీవ్ర ఘర్షణ ఏర్పడింది. విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీశ్‌రావుతోపాటూ మరికొందరు బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్ అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి బయలుదేరారు. మరోవైపు ఫామ్‌హౌస్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More in TG