CEC స్పష్టంగా సమాధానం చెప్పాలి: చిరాగ్ పాస్వాన్

ఎన్నికల కమిషన్‌పై సందేహం వస్తున్నప్పుడు, CEC స్పష్టంగా సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుండటంతో ఆయన స్పందించారు. ప్రజల మనసులో ఎన్నికల ప్రక్రియపై సందేహాలు రాకూడదని, కమిషనర్ తన వాదనను స్పష్టంగా చెప్పాలని అన్నారు. రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలు పని అని అయితే, ఎన్నికల కమిషన్ ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలని వివరించారు.

