ప్రధాని మోదీ మార్ఫింగ్ పోస్టులపై కేసు

TG: NEET పేపర్ లీక్ గొడవల టైమ్‌లో PM నరేంద్ర మోదీకి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై BJP మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు నడుపుతున్న వారితో పాటు మెటా ఇండియా హెడ్‌పై కూడా ఈ కేసులు పెట్టారు. ఆ వీడియోల లింకులు వెంటనే తీసేయాలని మెటా సంస్థకు పోలీసులు నోటీసులు పంపారు. ఆ పోస్టులు పెట్టిన వాళ్ల వివరాలు ఇవ్వాలని అడిగారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు చెప్పారు.



