విద్యార్థులకు విలువలు నేర్పాలి: కలెక్టర్

AP: విలువలతో కూడిన సమాజ నిర్మాణమే ఉపాధ్యాయుల ధ్యేయం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవ దినోత్సవం నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు విలువలు, నాయకత్వ లక్షణాలు, ఒత్తిడి, ఓటమిని తట్టుకునే సామర్థ్యాన్ని నేర్పాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్ తరాలకు అవసరమైన మార్గాన్ని ఉపాధ్యాయులు చూపాలన్నారు.



