హైడ్రా ఆగదు.. కబ్జాదారుల ఆటలు ఇక సాగవు

TG: హైడ్రా కమిషనర్ AV.రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి స్పందించారు. హైడ్రా పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని, ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంట, N కన్వెన్షన్ వంటి ఆక్రమణలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. HYDRAA తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. కోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.



