లోక్ సభ డిస్కషన్స్ లో జెన్ జీ లాంగ్వేజ్ !

పేపర్ లీక్ డిబేట్ టైమ్‌లో లోక్‌సభలో 'డిలూలు' 'క్లాక్ ఇట్' వంటి జెన్ జీ స్లాంగ్ వర్డ్స్ హల్‌చల్ చేశాయి. పోస్ట్ ఆఫీస్ యాక్ట్, పేపర్ లీక్ ఇష్యూస్‌పై డిస్కషన్ సమయంలో కాంగ్రెస్ ఎంపీ కృతి దేవి శర్మ మాట్లాడుతూ... ఎన్‌డీఏ గవర్నమెంట్ డెవలప్‌మెంట్ పేరుతో 'డిలూలు' (భ్రమల్లో) బతుకుతోందని, కాంగ్రెస్ దాన్ని ఎప్పటికప్పుడు 'క్లాక్ ఇట్' (ఎండగడుతూ) చేస్తోందని కామెంట్ చేశారు. యంగ్ జనరేషన్ లాంగ్వేజ్ పార్లమెంట్‌లో వినిపించడంతో ఇది అటు ఎంపీల దృష్టిని, ఇటు సోషల్ మీడియా అటెన్షన్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.



