ఇది విద్రోహ దినమే : మాస్ లైన్

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వార్‌లోని శ్రామిక భవన్‌లో గురువారం CPI(ML) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సిద్దు మాట్లాడారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. భూస్వామ్య, రాచరిక, వెట్టిచాకిరీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిందని పేర్కొన్నారు.

