అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దాం

నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. విద్యుత్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో విద్యు త్ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2000 ఆగస్టు 28న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి అమరులయ్యారని గుర్తు చేశారు.

