కాలేజ్ ప్రిన్సిపల్‌పై కత్తితో దాడి

AP: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఓ ఐటీఐ కళాశాలలో ఘర్షణ జరిగింది. కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కుమారుడు జిలానీ కత్తితో దాడి చేశాడు. జిలానీ కత్తితో బలంగా పొడవడంతో కాలేజ్ కమిటీ మెంబర్ హుస్సేన్, ప్రిన్సిపల్ శేషయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కళాశాల సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ మృతిచెందాడు. గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో సత్తార్, కమిటీ మెంబర్లకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి.



