ఆ దేశంలో కొత్త రూల్స్.. హిజాబ్ వేసుకుంటే నో ఎంట్రీ!
అజర్బైజాన్ దేశంలోని స్కూళ్లలో కొత్త డ్రెస్-కోడ్ రూల్స్ అమలవుతున్నాయి. లౌకికవాద సూత్రానికి (Principle of Secularism) విరుద్ధంగా ఉండే బట్టలను అనుమతించకూడదని రూల్ పెట్టారు. ఈ కారణంగా హెడ్ స్కార్ఫ్(హిజాబ్) వేసుకున్న స్టూడెంట్స్, టీచర్స్ స్కూళ్లలోకి యఅనుమతించకపోవడం వివాదానికి దారితీసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, తరగతుల బహిష్కరణలు జరుగుతున్నాయి. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలు 37 మంది నిరసనకారులను అరెస్టు చేశాయి.



