మహిళా జర్నలిస్టును పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ
ఓ మహిళా జర్నలిస్టును ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుకుని లాగడం, ఆయన సెక్యూరిటీ సిబ్బంది తోసేసిన ఘటన వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు గేట్ వద్ద రాహుల్ బైట్ తీసుకోవడానికి వెళ్లిన తనను రాహుల్ గాంధీ పట్టుకుని లాగారని, ఆయన సెక్యూరిటీ సిబ్బంది తోసేయడంతో మెట్లపై నుంచి కిందపడిపోయానని జర్నలిస్ట్ రిచా పరాశర్ తెలిపారు. కిందపడటం వల్ల కడుపులో నొప్పి రావడంతో ఆమెను గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ చేస్తుంటే తనపై అలా ప్రవర్తించడం సరికాదని ఆమె అన్నారు.



