D.K. శివకుమార్‌కు అవమానం?
ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి D.K శివకుమార్‌కు ఎదురైన పరిస్థితి రాజకీయంగా చర్చకు దారితీసింది. రద్దీ మధ్య రాహుల్ గాంధీ ఆయనను వెనక్కి లాగినట్లు, ఆ తర్వాత రాహుల్ భద్రతా సిబ్బంది, కార్యకర్తల మధ్య తోపులాటలో D.K. ఇబ్బంది పడినట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కర్ణాటక BJP అధ్యక్షుడు B.Y. విజయేంద్ర స్పందిస్తూ, ఇది కన్నడ ప్రజల గౌరవానికి అవమానమని విమర్శించారు. అయితే, ర్యాలీలో తీవ్ర రద్దీ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
