రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో 'ఇండియా'(INDIA) కూటమి భేటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే నేతృత్వంలోని 'ఇండి'(INDI) కూటమి నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కీలక వినతిపత్రం అందించారు. నాలుగు రోజులుగా ఓట్ల అక్రమాలు, దొంగతనాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల గురించి రాష్ట్రపతికి ఖర్గే వివరించారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, ఇందులో CEC జ్ఞానేష్ కుమార్ తీవ్రమైన పొరపాటు చేశారని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు.



