ఎలక్షన్ రిజల్ట్స్‌పై అమిత్ షా కీలక కామెంట్స్

విపక్షాల అసత్య ప్రచారాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో వచ్చిన ఎలక్షన్ రిజల్డ్స్‌పై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో జరిగిన ఉపఎన్నికలతో పాటు రాజస్థాన్, త్రిపుర మునిసిపల్ ఎన్నికల్లో NDA అభ్యర్థులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 'ఇండి' (INDI) కూటమిని ప్రజలు అస్సలు నమ్మలేదని అన్నారు.



